క్రైమ్/లీగల్

ఆస్తికోసం అన్నను చంపిన తమ్ముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, ఏప్రిల్ 13: సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన మండలంలోని కురంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కురంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర బొజ్జమ్మకు 13 ఎకరాల భూమి ఉంది. భర్త చనిపోవడంతో అన్నీ తానై వ్యవసాయ పనులు, కుటుంబ నిర్వహణ పనులన్నీ చూసుకుంటూ పెద్ద కుమారుడు ఎర్ర రాజశేఖర్ (25)తో చర్చిస్తూ ఉండేది. గత కొంత కాలంగా చిన్న కుమారుడు వెంకటయ్య ఆస్తి పంచాలని తగాదా పడుతున్నాడు. అన్న ఉండటం వల్లనే ఆస్తి పంచడం లేదని గురువారం రాత్రి ఇంటి ముందు కూర్చుని ఆస్తి పంపకాల విషయమై మాట్లాడుతుండగా ఆవేశంతో తమ్ముడు వెంకటయ్య బండరాయితో అన్న రాజశేఖర్ తలపై మోదాడు. తీవ్ర గాయాలకు గురైన రాజశేఖర్‌ను హైద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపారు.