క్రైమ్/లీగల్

దొంగనోట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఏప్రిల్ 13 : ఆదోనిలో దొంగనోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.లక్ష 72వేల దొంగనోట్లును, రెండు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకోని నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం డీఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ ఆదోనిలోని సత్యభారత్ పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి రెండు లీటర్ల పెట్రోల్ వేసుకుని రూ.200ల నోటును ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ వ్యక్తి వెళ్లిన తరువాత పెట్రోల్ బంకు మేనేజర్ షమీర్‌ఖాన్ ఇచ్చిన రూ. 200ల నోటు నకిలీ నోటుగా గుర్తించి వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. దొంగనోట్ల ముఠాపై గత కొన్ని రోజులగా నిఘావేసి ఉంచామని, అంతేకాకుండా ఈ ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం నియమించిట్లు తెలిపారు. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చిల్లిడాబా వద్ద బసాపురం గ్రామానికి కమ్మకిష్టప్పను అదుపులోకి తీసుకుని మోటార్ సైకిళ్లలో ఉన్న రూ.25వేల దొంగనోట్లను, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కిష్టప్పను విచారించగా తాను అప్పుల పాలయ్యాయని, అందువల్ల అప్పులు తీర్చుకోవడానికి దొంగనోట్లు తీసుకుని మార్పిడి చేస్తున్నట్లు తెలిపాడన్నారు. పత్తికొండలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న సత్యనారాయణ తనకు ఒక రూ.100ల మంచినోటుకు మూడు వంద రూపాయాల నోట్లను ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. పత్తికొండకు పోలీసు బృందం వెళ్లి బస్టాండ్‌లో ఉన్న సత్యనారాయణ అదుపులోకి తీసుకుని అతని నుండి రూ.లక్ష 47వేల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సత్యనారాయణను విచారించగా తనకు 8 నెలల క్రితం ఒక వ్యక్తి దొంగనోట్లను ఇచ్చినట్లు తెలిపాడని డీఎస్పీ తెలిపారు. సత్యనారాయణ నుండి ఒక సెల్‌పోన్ స్వాధీనం చేసుకుని దొంగనోట్లను, ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నామన్నారు. ఈ సమావేశంలో త్రీటౌన్ సీఐ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ ముఠాను పట్టుకున్న డీఎస్పీ క్రైమ్ పార్టీ కానిస్టేబుళ్లు ఏలిషా, శాంతరాజ్, ఆనంద్‌లకు రివార్డులు ఇచ్చి అభినందించారు.