క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ దాడుల్లో భారీగా పట్టుబడ్డ గంజాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), ఏప్రిల్ 13: విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం టాస్క్ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో సుమారు 1.10కోట్ల రూపాయల విలువైన 11క్వింటాళ్ల గంజాయితోసహా రెండు లారీలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కమినర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ కర్ణాటకు చెందిన గంజాయి స్మగ్లర్లు శివాజి, విశ్వనాథ్, నర్సిపట్నానికి చెందిన దేశపతి నాయుడుల సూచనల మేరకు విశాఖపట్టణం అనకాపల్లి సమీపంలోని మారుమూల గ్రామం నుండి గంజాయిని లోడుచేసుకొని హైదరాబాద్‌కు లారీలో తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు విఎం బంజర పోలీసులు గంజాయితో కూడిన లారీను పట్టుకున్నారు. పట్టుబడిన 646 కిలోల గంజాయిని తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. దీని విలువ 64లక్షల 60వేలు ఉంటుందన్నారు. లారీ డ్రైవర్‌లు లక్ష్మణ్ రాథోడ్, మహ్మద్ జాఫర్ అలీలను అరెస్ట్ చేసి గంజాయి ఎక్కడ నుండి ఎక్కడకు రవాణా చేస్తున్నారో తెలుసుకుని పూర్తి వివరాలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల నుండి ఖమ్మం మీదుగా రాజస్థాన్‌కు గంజాయి రవాణా జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం మేరకు ఏదులాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఏసిపి టాస్క్ఫోర్స్, ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ నిర్వహిస్తుండగా అక్రమంగా లారీలో రవాణాచేస్తున్న గంజాయిని పట్టుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. పట్టుకున్న గంజాయి 460 కిలోలు. దీని విలువ సుమారుగా 46లక్షలు. నిందితుల్లో మరిపెడా బంగ్లాకు చెందిన గుగులోతు వెంకన్న, నాగోరు జిల్లా రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్ వి ప్రేమ్, లారీ క్లీనర్ అశోక్ వున్నారు. గంజాయి వాహనానికి ముందు పైలట్‌గా వ్యవహరిస్తూ మరో వాహనంలో ముందుగా వెళ్తున్న ముగ్గురు నిందితులు పరారయ్యారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఏసిపి, రూరల్ పోలీసులను సిపి తఫ్సీర్ ఇక్భాల్ అభినందించారు. విలేఖరుల సమావేశంలో అడినల్ డిసిపి కొల్లు సురేష్‌కుమార్, ఎసిపిలు రెహ్మాన్, ప్రసన్నకుమార్, నరేష్‌రెడ్డి, సత్తుపల్లి రూరల్ సిఐ రమేష్, ఎస్బీ సిఐ సంపత్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.