క్రైమ్/లీగల్

గజ దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 13 : నగరంలో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌చేసి, అతని వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీసీఎస్ డీఎస్పీ బాలసుందరరావు తన కార్యాయలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బీపీ ఆగ్రహారానికి చెందిన తిరకాల చంద్రశేఖర్ తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటాడు. 2015 సెప్టెంబర్ 2వ తేదీన వెంకటగిరిలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి ఐదున్నర సవర్ల బంగారు ఆభరణాలు, ఈ నెల 11న వెంకటగిరిలోనే మరో ఇంట్లో 16 సవర్ల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ కేసులపై దృష్టి సారించిన క్రైం బ్రాంచ్ పోలీసులు, వెంకటగిరి పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం నగరంలోని మండపాల వీధిలో తచ్చాడుతున్న చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 21.5 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన క్రైం బ్రాంచ్ సీఐ బాజీజాన్‌సైదా, వెంకటగిరి ఎస్సై కె కొండపనాయుడు, క్రైం బ్రాంచ్ ఎస్సై కె రామకృష్ణ, హెచ్‌సిలు కె గిరిధర్‌రావు, జె సురేష్‌బాబు, కానిస్టేబుళ్లు షేక్ గౌస్‌బాషా, కేవీ కృష్ణ, ఎం తిరుమలను డీఎస్పీ అభినందించారు.