క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్ : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కంచుకోట లాంటి అబూజ్‌మాడ్ దండకారణ్యంలో భద్రతా బలగాలతో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. నారాయణపూర్ జిల్లాలో దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 3వ తేదీన రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి చెందిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్‌గఢ్- మహారాష్టల్ర మధ్య దట్టమైన అబూజ్‌మాడ్ అడవులు ఉన్నాయి. నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా పోలీసుస్టేషన్ పరిధిలోని దుర్బేడ అడవుల్లో మావోయిస్టులు శిక్షణ కోసం సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాల
సమాచారంతో ప్రత్యేక బలగాలు మావోల కోసం వెతుకులాట ప్రారంభించాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో కూంబింగ్‌లో ఉన్న డీఆర్‌జీ బలగాలకు మావోలు తారసపడ్డారు. బలగాలను గమనించిన మావోలు కాల్పులకు దిగగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు గంటన్నర పాటు భీకరంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చెల్లాచెదురయ్యారని, ఎన్‌కౌంటర్ ప్రదేశం వద్ద ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని చత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. మావోయిస్టులు శిక్షణ కోసం అబూజ్‌మాడ్ దండకారణ్యంలో కొన్ని రోజుల నుంచి సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చిందని, దీంతో డీఆర్‌జీ బలగాలను పంపినట్లు ఆయన తెలిపారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయని, ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారని, వారికి తక్షణ వైద్యం అందించేందుకు రాజధాని రాయపూర్ తరలించినట్లు డీజీపీ తెలిపారు. కాగా దట్టమైన దండకారణ్యం కావడంతో మృతదేహాల తరలింపు ఆలస్యమైనట్లు తెలిసింది. చత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్ పర్వత దండకారణ్యం మావోయిస్టులకు కార్యకలాపాలకు పెట్టని కోట. అగ్రనేతలంతా ఈ దండకారణ్యంలోనే తలదాచుకుంటారన్న ప్రచారం ఉంది. దాదాపు 6వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ దండకారణ్యంలో భద్రతా బలగాలు కాలు మోపాలంటే సాహసమే. 2017లో దండకారణ్యంలో సర్వే చేయాలని ప్రభుత్వం భావించినా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ ఆలోచన విరమించుకున్నారు. సర్వే ప్రారంభించిన సమయంలోనే భారీ ఐఈడీ పేలింది. ఈ పరిస్థితుల్లో తాము సర్వేకు వెళ్లలేమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి నుంచి సర్వే నిలిచిపోయింది. మావోయిస్టుల రక్షణ ప్రాంతమైన అబూజ్‌మాడ్‌లో తొలిసారి డీఆర్‌జీ బలగాలు చొచ్చుకెళ్లి బీభత్సం సృష్టించాయి.