క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు : కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డగా, మరో వ్యక్తి చిక్సిత పొందుతూ మరణించిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోనేరుపాడు గ్రామానికి చెందిన భట్టిప్రోలు లీలాకృష్ణ(24), సాయి గంగూరు దగ్గర ఉన్న రిలయన్స్ గోడౌన్‌లో పనిచూసుకుని విజయవాడకు బైక్ మీద తిరుగుముఖం పట్టారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో స్లో అయ్యారు. ఇంతలో 333 సిటీ బస్సు వచ్చి ఢీకొంది. సాయి కుడివైపునకు, లీలాకృష్ణ ఎడమవైపుపడ్డారు. బస్సు చక్రం లీలా కృష్ణ మీదగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన సాయిని, లీలాకృష్ణను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లీలాకృష్ణ మృతి చెందాడు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.