క్రైమ్/లీగల్

చేపల చెరువులో మునిగి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, ఏఫ్రిల్ 12: కృష్ణాజిల్లా నందివాడ మండలంలోని తమిరిశ గ్రామంలో గల 20 ఎకరాల చేపల చెరువులో మేత కడుతుండగా ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన గురువారం జరిగింది. నందివాడ ఎస్‌ఐ మణికుమార్ కథనం ప్రకారం తమిరిశ నుండి నందివాడ వెళ్లే రోడ్డులో గల చేపల చెరువులో ఈ ప్రమాదం జరిగింది. గుడివాడ నాగవరప్పాడుకు చెందిన కత్తుల నాగరాజు ఈ చెరువు సాగు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెరువులో మేత వేయడానికి చెరువు వద్దకు వెళ్లాడు. చెరువువద్ద కాపలా ఉన్న విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బంటుమిల్లి ఆదినారాయణ, మంగమ్మలను పడవలో ఎక్కించుకొని చెరువులో చేపలకు వేరుశెనగచెక్క వేయడానికి ముగ్గురు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పడవ ఇంజను స్పీడు పెరగడంతో ప్రమాదం జరుగుతుందని అనుకొని భయపడి పడవలో ఉన్న మంగమ్మ చెరువులోకి దూకేసింది. ఆమెను రక్షించి పడవలో ఎక్కించడం కోసం ఆమె భర్త ఆదినారాయణ వంగి అందుకోబోయాడు. పడవలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక పక్కకు రావడంతో పడవ ఇంజను స్పీడుతో చెరువులోకి ముందుకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలోప్రమాదవశాత్తు పడవ బోల్తాపడింది. దీంతో పడవలో ఉన్న కత్తుల నాగరాజు, ఆదినారాయణ పడవ కిందపడి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. పడవ గట్టుపక్కనే ఉండగా దూకిన మంగమ్మ మాత్రం క్షేమంగా బైటపడింది. మృతదేహాలను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యులు పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పజెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.