క్రైమ్/లీగల్

వారంలోగా ఖురేషీకి పదోన్నతి కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కొలీజియం సిఫార్సులకు అనుగుణంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అఖిల్ ఖురేషీకి పదోన్నతికి కల్పిస్తూ వారం రోజుల్లోగా చర్యలు తీసుకొంటామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ బాబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్ ధర్మాసనానికి ఖురేషీ పదోన్నతిపై వారం లోగా చర్యలు తీసుకోనున్నామని సొసిలిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ‘ఖురేషీ పదోన్నతి అంశంపై వారంలోగా చర్యలు తీసుకోవాలని నాకు ఆదేశాలున్నాయి’ పేర్కొన్నారు. అయితే, కొలీజియం సిఫార్సులకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించి ఈ దిశగా చర్యలు తీసుకొనేందుకు వారం గడువు కోరుతున్నట్లు మెహతా సుప్రీంకు పేర్కొన్నారు. ఆగస్టు 14లోగా ఖురేషీ నియామకంపై చర్యలు తీసుకోవాలన్న కొలీజియం సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల రెండో తేదీన కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖురేషీ నియామకంపై కేంద్రానికి సూచనలు చేయాలని గుజరాత్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఇతర హైకోర్టు న్యాయమూర్తుల అంశాన్ని మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకొని ఖురేషీ పేరును నోటిఫై చేయలేదని జీహెచ్‌సీఏఏ ఆరోపించింది. మే పదో తేదీన కొలీజియం సిఫార్సులు చేసినప్పటికీ జూన్ ఏడో తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రవిశంకర్ ఝాను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని కోర్టుకు వివరించింది. ఈమేరకు వారంలోగా ఖురేషీకి పదోన్నతి కల్పిస్తూ వారంలోగా చర్యలు తీసుకొంటున్నట్లు సొలిసిటర్ జనరల్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.