క్రైమ్/లీగల్

పులికాట్‌లో పడవ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఆగస్టు 16: నెల్లూరు జిల్లా తడ మండల పరిధిలోని పులికాట్ సరస్సు మధ్యలో ఉన్న ఇరకం దీవి నుంచి భీములవారిపాళెంకు వస్తున్న బోటు శుక్రవారం ఆకస్మికంగా బోల్తాపడింది. ఈ సంఘటనలో పడవలో ఉన్న ముగ్గురు చిన్నారులు, మరో దివ్యాంగుడు ప్రాణభయంతో అస్వస్థకు గురైయ్యారు. ఇరకం దీవిలోని తిరువెంగడనగర్‌లోని మత్స్యకార గ్రామంలో తిరునాళ్లు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఇరకం దీవినుంచి ఉదయం 6.30 గంటల సమయంలో భీములవారిపాళెం గ్రామానికి మాంబట్టు సమీపంలోని హైసెన్ లాజెస్టిక్ పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికులు వస్తుంటారు. ఇరకం దీవిలో గ్రామోత్సవం సందర్భంగా తమిళనాడు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా ఆ పడవ పరిమితికి మించి 35మంది వరకు ఆ బోట్లో ప్రయాణించారు. భీములవారిపాళెం పడవల రేవుకు రెండు కిలోమీటర్ల సమీపంలో అలల తాకిడికి బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంజు అనే 15ఏళ్ల బాలిక, తిరువన్నానర్ గ్రామానికి చెందిన కుప్పమ్మ కుమారుడు రోషన్ (5), రెండేళ్లపాప ఖైలీ నీటమునిగి అస్వస్థకు గురయ్యారు. అదే సమయంలో ఇరకం నుంచి మరో రెండు పడవలు భీములవారిపాళెంకు వస్తూ పడవ బోల్తా పడటాన్ని గమనించి నీటిలో పడినవారిని రక్షించి ఆరంబాకం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పులికాట్‌లో ఎక్కువ నీరు లేనందువల్ల పెనుప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు. తిరువన్నగర్ గ్రామానికి చెందిన రమణయ్య అనే దివ్యాంగుడు కూడా నీటమునిగి అస్వస్థకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తడ డీటీ జేజే రావు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు.