క్రైమ్/లీగల్

పాత చట్టం ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్డినెన్స్ కాపీలను కోర్టుకు సమర్పించారు. ఏ ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాత ఆర్డినెన్స్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించి, కొత్త ఆర్డినెన్స్ మద్దతు తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టులో విచారణ కొనసాగగా, కౌంటర్‌లో పొందుపరిచిన అంశాల్లో వాస్తవం కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. కాగా, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ గందరగోళంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ, కౌంటర్‌లో పేర్కొన్న అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికలపై ఇంత వరకూ 606 అభ్యంతరాలు వచ్చాయని కరీంనగర్ నుండి 109, మహబూబ్‌నగర్ నుండి 77, మీర్‌పేట నుండి 39, సుల్తానాబాగ్ నుండి 37 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. అభ్యంతరాలు అన్నీ ఒక్క రోజులో పరిష్కరించలేరు కదా అని వ్యాఖ్యానించింది. మొత్తం అభ్యంతరాలను ఎపుడు పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు, వర్గీకరణకు సంబంధించి ఉన్న సమస్యను పక్కన పెట్టి ఎన్నికలకు ఎలా వెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో సమగ్ర కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి గడువు ఇస్తూ తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.