క్రైమ్/లీగల్

370పై నేడు సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలపైన పిటిషన్లపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. న్యాయవాది ఎంఎల్ శర్మ, కాశ్మీర్ టైమ్స్ సంపాదకురాలు అనూరాధ భాసిన్, నేషనల్ కాన్ఫరెన్స్ వేరువేరుగా వేసిన పిటిషన్లను ఒకే దగ్గరకు చేర్చి, విచారణను కొనసాగిస్తుంది. ఆర్టికల్ 370ని అరద్దు చేసిన మరుసటి రోజే, ఈ చర్యను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో శర్మ పిటిషన్ వేశారు.
పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, ఆతర్వాత ఆ బిల్లుపై రాష్ట్రపతి సంతకం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 370 అనేది రాజ్యాంగంలో శాశ్వత అధికరణ అని, దీనిని రద్దు చేసే అవకాశం లేదని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. కాగా, ఈనెల 10వ తేదీన సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనురాధ పలు అంశాలను ప్రస్తావించారు. జమ్మూకాశ్మీర్‌లో మీడియాపై విధించిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, స్థానిక పాలనాధికారులను ఆదేశించాలని ఆమె సుప్రీం కోర్టును కోరారు. జమ్మూకాశ్మీర్‌లోకి మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడం రాజ్యాంగంలోని 14, 19 (1) (ఏ), 19 (1) (జీ) అధికరణలకు విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపారు. సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు, వైఫై కనెక్షన్లు, ఇంటర్నేట్ సౌకర్యం వంటి సమాచార వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలని ఆమె కోరారు. జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునే హక్కు మీడియాకు ఉందని ఆమె తెలిపారు. ఆంక్షలను ఎత్తివేయకపోతే, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రజలకు కనీస హక్కులు కూడా లేకుండా చేయడం సమంజసం కాదని పార్టీ తన పిటిషన్‌లో పేర్కొంది. స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగానూ, అమలు చేయడానికి తగనిదిగానూ ప్రకటించాలని సుప్రీం కోర్టును కోరింది.
నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున లోక్‌సభకు ప్రాతినిథ్యం వహ్తిన్న మహమ్మద్ అక్బర్ లోన్, విశ్రాంత న్యాయమూర్తి హస్‌నైన్ మసూదీ జమ్మూకాశ్మీర్ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. మరి కొంత మంది కూడా వేరువేరుగా పిటిషన్లు వేసినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో, ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్ సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం వాటిని లిస్ట్‌లో చేర్చలేదు. మిగతా పిటిషన్లను ఏక మొత్తంగా తీసుకొని, వాటిపై విచారణను శుక్రవారం ప్రారంభించనుంది.