క్రైమ్/లీగల్

ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఆస్తి తగాదాల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి దయాచారిని హత్య చేసేందుకు యత్నించిన ఐదుగురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. దయాచారి కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తులు గుంటూరు, పటాన్‌చెరువుల్లో ఉన్నాయి. వీటి విషయమై ఆయన సోదరుని పిల్లలైన మంజుల, కరుణాకర్‌లతో వివాదం నడుస్తోంది. దీనంతటికీ దయాచారే కారణమని ఆగ్రహంతో ఉన్న మంజుల, కరుణాకర్ ఎలాగైనా దయాచారిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం తమ వ్యాపార భాగస్వామి అయిన వెంకటేశ్వరావును సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. దీనికి ఒప్పుకోవడంతో అడ్వాన్స్‌గా రూ. 15,000 వేలు అందించారు. పని పూర్తయి ఆస్తి తమ చేతికి వస్తే మిగిలిన మొత్తాన్ని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రంగంలోని దిగిన వెంకటేశ్వరరావు, కరుణాకర్, నరేష్‌లతో కలిసి దయాచారిపై దాడికి పథకం రచించారు. ఈ నెల 5న ఉదయం ప్రశాసన్‌నగర్‌లో దయాచారి వాకింగ్ చేస్తున్న సమయంలో సాగర్, అయ్యప్ప, రాజేష్ బైక్‌లపై ప్రయాణిస్తూ వికెట్‌తో ఆయన తలపై దాడి చేసి పారిపోయారు. అయితే దయాచారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మంజుల, కరుణాకర్ ప్రోత్సాహంతోనే దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.