క్రైమ్/లీగల్

అనధికార నిర్మాణాలను అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అనధికారిక, అనుమతి లేని నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోకపోవడంపై, సుప్రీంకోర్టు..కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం రాజకీయ కారణావల్ల అటుంటి అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలేదంటూ చివాట్లు పెట్టింది. ఢిల్లీలో చేపట్టే అనధికారిక నిర్మాణాలను అడ్డుకోకుండా నిరోధిస్తున్న 2006, ఆ తర్వాత అమల్లోకి తెచ్చిన చట్టాలపై జస్టిస్ మదన్ బి. లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా అనధికార నిర్మాణాల వల్ల నగరంలో కాలుష్యం పెరిగిపోతున్నదని, ముఖ్యంగా పిల్లల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని పేర్కొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎ.ఎన్.ఎస్. నాద్‌కర్ణి.. సంబంధిత అధికార వర్గాలతో చర్చలు జరిపామని, దీనికి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించామని కోర్టుకు తెలియజేశారు. కాగా ‘మీరు ఇక్కడ కొన్ని అంశాలు గుర్తు పెట్టుకోవాలి. ఇది రాజకీయ సమస్య కాదు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య’ అని ధర్మాసనం పేర్కొంది.
వివిధ నిర్మాణల్లో ముఖ్యంగా పాఠశాలల్లో అగ్నిప్రమాదాలనుంచి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్న అంశంపై అధికార్లు తనిఖీలు చేపట్టాలని కోరింది. లాభాలకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేసింది. కాగా అంతకుముందు కోర్టు 2006 ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీని పునరుద్ధరించాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించి చేపట్టే నిర్మాణాలను గుర్తించి వాటిని నిలుపుచేసే అధికారం ఈ కమిటీకి ఉంటుంది.