క్రైమ్/లీగల్

యువతి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, ఏప్రిల్ 9: పెళ్లింట..చావు బాజా మోగింది. మరి కొన్ని రోజుల్లో బాజా భజంత్రీలతో పెళ్లి అయ్య కళకళలాడాల్సిన ఇల్లు చావుడప్పులతో శోక సంద్రమైంది. పేదింట పెళ్లి చేయడం ఎంత భారమో.. శిరీష మరణం కళ్లకు కట్టింది. వివరాలు ఈ విధంగా ఉన్నా యి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పారంపెల్లి శిరీష (21) వివాహం ఈనెల 19న జరగాల్సి ఉంది. ఈనెల 4న వివాహ నిశ్చితార్థం జరుగగా పెళ్లి వేడుకలకు బంధువులంతా సన్నద్ధమయ్యారు. శిరీష తల్లి సాయమ్మ పలువురి వద్ద వివాహ వేడుకలకు డబ్బులు సమకూర్చాలని, పలువురిని కోరగా ఎవరూ కూడా డబ్బులు సమకూర్చడానికి సంసిద్ధతను వ్యక్తం చేయకపోవడంతో దిగులుపడిపోయింది. తన వద్ద ఉన్న కొద్ది పాటి డబ్బులతో వరుడికి ద్విచక్ర వాహనం, అర తులం బంగా రం అప్పగించగా పెళ్లి పత్రికలను ముద్రించి బంధువులకు పంచిపెట్టారు. పెళ్లి సమయం దగ్గరికి వస్తున్నా డబ్బులు పలువురి వద్ద అడిగినా అందకపోవడంతో కుమార్తె శిరీషతో బాధను వ్యక్తం చేసింది. కలత చెందిన శిరీష తల్లి బాధ చూడలేక తనకు పెళ్లి నిశ్చయమైనా వివాహం కాదేమోనన్న బెంగతో మనసు కలత చెంది సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరి వేసుకొని బలవన్మణానికి పాల్పడింది. దీంతో పెళ్లింట చావు బాజా మోగడంతో గ్రామస్థులం తా శోక సంద్రంలో మునిగిపోయారు. శిరీష తండ్రి చిన్న తనంలోనే మరణించగా అన్నీ తానై పెంచిన తల్లి సాయమ్మను విడిచి పెట్టి ఒక్కగానొక్క శిరీష బలవన్మరణానికి పాల్పడటంతో బంధువులు తల్లిడిల్లిపోతున్నారు. మృతురాలి శిరీష తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై మహేష్ తెలిపారు.

చిత్రం..ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడిన పారంపెల్లి శిరీష