క్రైమ్/లీగల్

నిరుద్యోగులకు టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఆజాంపురా రాజానరసింహా నగర్‌కు చెందిన బద్దం యెల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని నకిలీ ఐడి కార్డు, ఆరు బాండ్లు, నకిలీ నియామక పత్రం ఒకటి, సెల్‌ఫోన్, రూ.4.07,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డిసిపి పి.రాధాకిషన్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిహెచ్‌ఎంసి, మెట్రోవాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్టుమెంట్, హోంచైల్డ్ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్లు, సూపర్‌వైజర్లు వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని బోగస్ మాటలు చెప్పి అమాయకుల నుంచి డబ్బు గుంజుతున్నాడు. ఇందుకు నకిలీ నియామకపత్రాలు, ఐడికార్డులు కూడా సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగానే్వషణలో ఉన్న కె.రవీంద్ర స్వామికి యేల్లేశ్ పరిచయం అయ్యాడు. తాను సచివాలయంలో అధికారిగా పని చేస్తున్నట్లు చెప్పి నమ్మించాడు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ.2 లక్షలు చెల్లిస్తే అటెండర్ ఉద్యోగం నీ సొంతం అవుతుందని రవీంద్ర స్వామికి భరోసా ఇచ్చాడు. అతని మాటలు నమ్మి 2014 అక్టోబర్‌లో రూ.2 లక్షలు సమర్పించుకున్నాడు. ఈ రకంగా అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో 37 మంది నిరుద్యోగులను మోసం చేసి రూ.1, 24,00,000 కాజేశాడు. బీమా రాహుల్ అనే ఓ బాధితుడు కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిని పట్టుకుని ఈ ఏడాది జనవరి 19న అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో కూడా నిందితుడిపై నాలుగు కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో భాగంగా తప్పించుకుతిరుగుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించింది.

చిత్రం..నిందితుడు బద్దం యెల్లేశ్ వివరాలు విలేఖరులకు తెలుపుతున్న టాస్క్ఫోర్స్ డీసీపీ