క్రైమ్/లీగల్

కోమటిరెడ్డి, సంపత్ పిటిషన్లపై తీర్పు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడంపై దాఖలైన పిటీషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. నల్గొండ, ఆలంపూర్ శాసనసభ స్థానాలు ఖాళీ అయినట్టు నోటిఫై చేయకుండా , శాసనసభ సభ్యత్వాల రద్దును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై జస్టిస్ బి శివశంకర్ విచారణ పూర్తి చేశారు. శాసనసభ్యులకు వారి వివరణ చెప్పుకునే అవకాశం కల్పించకుండానే వారి సభ్యత్వాలను రద్దు చేశారని వారి తరఫున హాజరైన న్యాయవాది తమ వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన కార్యకలాపాల వీడియో ఫుటేజీని న్యాయస్థానానికి సమర్పించలేదని, శాసనసభ కార్యదర్శి లేదా ఇతర సంబంధిత అధికారులు న్యాయస్థానం ముందు కౌంటర్ దాఖలు చేయలేదని, కనీసం తమ తరఫున వాదించేందుకు న్యాయవాదిని కూడా నియమించలేదని పిటీషనర్ల తరఫున న్యాయవాది పేర్కొన్నారు. సహజన్యాయసూత్రాలకు విరుద్ధంగా తీసుకునే నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యాన్ని అడ్డుకోజాలరని ఆర్టికల్ 122, ఆర్టికల్ 212 చెబుతున్నాయని న్యాయవాది పేర్కొన్నారు. వీడియో ఫుటేజీ ఇస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్ర రావు పేర్కొన్నారు. ఏజీ ఇచ్చిన హామీ ప్రస్తావన అక్కర్లేదని, ఎమ్మెల్యేల శాసనసభ్యత్వ రద్దు విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు.