క్రైమ్/లీగల్

9 నెలల్లో తేల్చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చి వేసిన ఘటనపై విచారణను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. ఈ ఘటనలో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిల ప్రమేయంపైనా తీర్పును వెలువరించాలని పేర్కొంది. అయోధ్యలోని వివాదస్పద స్థలంలోని కట్టడాన్ని కూల్చి వేసిన ఘటనపై ప్రత్యేక న్యాయమూర్తి సారథ్యంలో ప్రత్యేక బెంచ్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఇలాఉండగా శుక్రవారం సుప్రీకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం రాజకీయంగా సున్నితమైన ఈ కేసును ఆరు నెలల్లో విచారణను ముగించాలని పేర్కొంది. ఇలాఉండగా ఈ కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయమూర్తి పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30న ముగియనున్నందున, ఆ న్యాయమూర్తి పదవీ కాలాన్ని పొడిగించే విషయంలో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యేక న్యాయమూర్తి పదవీ కాలం పొడిగింపు అనేది అయోధ్యలోని కట్టడాన్ని కూల్చి వేసిన ఘటనపై విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వడానికేనది ధర్మాసనం తెలిపింది. పదవీ విరమణ తర్వాత పొడిగింపు కాలంలో ప్రత్యేక న్యాయమూర్తి అలహాబాద్ హైకోర్టు పరిథిలోనే ఉంటారని వివరించింది.
ఇలాఉండగా ఈ కేసుపై విచారణ ముగించేందుకు తనకు మరో ఆరు నెలల గడువు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి సోమవారం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బీజేపీ అన్రేతలైన అద్వానీ, జోషి, ఉమా భారతిలు బాబ్రీ మసీదు కూల్చి వేసిన ఘటనలో కుట్రదారులంటూ 2017 సంవత్సరం ఏప్రిల్ 19న సుప్రీంలో కేసు దాఖలైంది. ఇంకా గిరిరాజ్ కిషోర్, విశ్వహిందు పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్, విష్ణు హరి దాల్మియపైనా అప్పట్లో ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. కాగా దాల్మియ మృతి చెందడంతో ఆయన పేరును కేసును తొలగించారు. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చి వేసే సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే కళ్యాణ్ సింగ్ ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున ఆయన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు విచారణ జరపడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.