క్రైమ్/లీగల్

కరడుగట్టిన గొలుసు దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: నగరంలో మహిళల మెడలోని గొలుసులు తెంపుకుపోయే కరడుగట్టిన దొంగను టాస్క్ఫోర్స్ దక్షిణ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. టాస్క్ఫోర్స్ అదనపుడిసిపి ఎస్.చైతన్య కుమార్ ఈ కేసుకు సంబంధించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాహీన్‌నగర్ ఎర్రకుంటకు చెందిన మహ్మద్ అమీర్ అలియాస్ అమెర్ అలియాస్ ప్రిన్స్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. క్రమేణా దొంగతనాలకు అలవాటు పడిన అమీర్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 60 గొలుసులు తెంపుకు పోయిన కేసుల్లో నిందితుడు. మాదకద్రవ్యాలకు, లగ్జరీ జీవితానికి అలవాటుపడి డబ్బు కోసం 2009 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అనేక సార్లు అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినా తిరిగి అవే నేరాలకు పాల్పడుతున్నాడు. 2015లో చిక్కడపల్లి పోలీసులు అమీర్‌పై పిడి చట్టాన్ని కూడా ప్రయోగించారు. పిడి చట్టంపై అరెస్టు అయి విడుదలైన తర్వాత కూడా 25 చోట్ల గొలుసులు తెంపుకుపోయాడు. ఈ పరిస్థితిలో తొలిసారి మోటార్ సైకిల్ దొంతతనానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న డూప్లికేట్ తాళం చెవి ఉపయోగించి హోండా షైన్ మోటార్ సైకిల్‌ను దొంగిలించాడు. తర్వాత ఏప్రిల్ 3న మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం మహిళ మెడలో నుంచి బంగారు మంగళసూత్రాల తాడు దొంగిలించుకుపోయాడు. పోలీసులు సకాలంలో స్పందించి రంగంలో దిగడంతో నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడి కదలికలపై దృష్టిసారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 30 గ్రాముల బంగారం, హోండా షైన్ వాహనానాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కోసం మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ కేసును టాస్క్ఫోర్స్ దక్షిణ మండలం ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి, ఎస్‌ఐలు కెఎన్ ప్రసాద్ వర్మ, జి.వెంకటరామిరెడ్డి, ఎన్.శ్రీశైలం, మహ్మద్ తఖియుద్దీన్ దర్యాప్తు చేశారు.