క్రైమ్/లీగల్

తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 5: ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్‌ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ గురువారం కడప నగరంలోని తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. సునీల్‌కుమార్ 2 హత్యకేసులు, 6 కిడ్నాప్ కేసులు, 4 హత్యాప్రయత్నం కేసులు, 2 అక్రమ ఆయుధాల కేసులు, 2 చోరీ కేసులు కలిపి మొత్తం 19 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ జైలుశిక్ష కూడా అనుభవిస్తున్నాడని తెలిపారు. అయితే గత నెల 27వ తేదీ సెంట్రల్ జైలు నుంచి కర్నూలు కోర్టుకు హాజరై తిరిగి వస్తూ పక్కా వ్యూహం పన్ని ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి తుపాకులతో పరారయ్యాడన్నారు. దీంతో సునీల్ కోసం 8 ప్రత్యేక బృందాలను నియమించగా వారు చింతకొమ్మదినె్న వద్ద సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ వివరించారు.