క్రైమ్/లీగల్

డ్రైవర్ల నిర్లక్ష్యంతో మూడు బస్సులు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఏప్రిల్ 2: డ్రైవర్ల నిర్లక్ష్యంతో 3 బస్సులు ఒకదాని వెంట మరొకటి ఢీకొన్న సంఘటనలో ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు గాయాలపాలైన సంఘటన సోమవారం మధ్యాహ్నం రేణిగుంట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కోడూరు నుంచి తిరుపతికి వెళ్తున్న పల్లెవెలుగు, శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు, రేణిగుంట నుంచి తిరుమలకు వెళ్తున్న బస్సులు అతివేగంగా ఒక దానిని మరొకటి ఓవర్‌టేక్ చేసే క్రమంలో 3 బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తమ సీటు ముందున్న ఇనుపరాడ్‌కు తగిలి తలపైన, ముఖంపైన, నోటిపైన గాయాలయ్యాయి. తిరుపతి-రేణిగుంట రోడ్డులో ఆర్టీసీ బస్సులు ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి రావడంతో ఒక బస్సు వెనుక మరొక బస్సు ఢీకొనడంతో పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకోగలిగారు. దీంతో ఆందోళనకు గురైన బస్సులోని ప్రయాణికులు మాట్లాడుతూ తాము శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, స్వామి వారి ఆశీస్సులతోనే పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పారు. అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని, ఆర్టీసీ బస్సులలోనే సూచికబోర్డులు పెట్టినా డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులు నడపటంతో ఈ ప్రమాదం జరిగిందని వాపోయారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు మేల్కొని డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలకు భద్రత చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడ్డ ప్రయాణికులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకొని ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులను పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ప్రమాదం తలెత్తినా, గంటసేపైనా ప్రత్యామ్నాయంగా ప్రయాణికులకు వేరే బస్సులో పంపలేదని ఆర్టీసీపై దూషణలకు దిగారు.