క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతోనే 10 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్మెర్: జోధ్‌పూర్‌లోని బార్మెర్‌లో ఆదివారం సాయంత్రం పెళ్లి పందిరి కూలిన ఘటనలో మరణించిన 15 మందిలో 10 మంది విద్యుదాఘాతంతోనే మరణించారని బలోత్రాలోని ప్రభుత్వ నహతా ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బలరామ్ నహ్‌తా తెలిపారు. సంఘటన స్థలంలో 14 మంది మరణించగా, తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తికి జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం టెంట్ కింద కూర్చుని ‘రామ కథ’ను తిలకిస్తుండగా బలమైన గాలులు వీచడంతో పందిరి ఒక్కసారిగా కూలిందని ఆయన తెలిపారు. ఈ దుర్ఘటనలో 10 మంది కేవలం విద్యుదాఘాతంతోనే మరణించారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో మరణించారని, మరో వ్యక్తి శరీరం నుంచి ధారాళంగా రక్తం వృథా కావడంతో మరణించాడని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఆసుపత్రిలో 24 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల మరణాలు సంభవించినందున ఐపీసీ సెక్షన్ 304-ఏ కింద, వ్యక్తిగత భద్రత నియమాలు పాటించనందున సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బలోత్రా పోలీస్ స్టేషన్ అధికారి షైతాన్ సింగ్ తెలిపారు.