క్రైమ్/లీగల్

ఎన్నిక ఫలితంపై సుప్రీంకు మోదుగుల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 25: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు పార్లమెంటు ఎన్నిక ఫలితంపై వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిసింది. శనివారం తనను కలిసిన పార్టీ ముఖ్యనేతల వద్ద ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నెల 23న జరిగిన ఓట్ల లెక్కింపులో పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్‌లను తిరస్కరించటంపై మోదుగుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 10,300 పోస్టల్ బ్యాలెట్లను జిల్లా ఎన్నికల అధికారి, గుంటూరు పార్లమెంటు రిటర్నింగ్ అధికారి కోన శశిధర్ నిబంధనల మేరకు లేవన్న కారణంతో తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు వచ్చిన మెజార్టీ కేవలం 4200 మాత్రమే ఉండటం, తిరస్కరణకు గురైన పోస్టల్ బ్యాలెట్‌లు 10 వేలకు పైగా ఉండటం తెలిసిందే. పోలైన పోస్టల్ బ్యాలెట్‌లలో దాదాపు 60 శాతానికి పైగా వైసీపీకి అనుకూలంగా ఉండటంతో వాటిని పూర్తిస్థాయిలో లెక్కిస్తే విజయం తనదే అవుతుందన్న ఆలోచనతో మోదుగుల ఉన్నారు. ఉద్యోగి డిక్లరేషన్ ఫారంపై ఉన్న నెంబర్‌ను పోస్టల్ బ్యాలెట్ ఉన్న కవరుపై నమోదు చేయకపోవడంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని తెలియవచ్చింది. నెంబర్ నమోదు చేయని పోస్టల్ బ్యాలెట్లను అధికారులు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని, దీనిపై అధికారులే సమాధానం చెప్పాలని మోదుగుల అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా పోస్టల్ బ్యాలెట్లను అక్కడి ఎన్నికల అధికారులు లెక్కించారని, అయినప్పటికీ ఇక్కడ మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించటం అధికారుల పక్షపాత వైఖరికి నిదర్శనమని ముఖ్యనేతల వద్ద మోదుగుల ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది ఓటర్ల హక్కులను కాలరాయడమే అవుతుందని, ఎన్నికల అధికారుల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకుంటానని మోదుగుల స్పష్టం చేసినట్లు సమాచారం.