క్రైమ్/లీగల్

పిడుగులు పడి ముగ్గురు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మే 24: ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి విపత్తుకు ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిశాయి. రెండు వేర్వేరు సంఘటనల్లో పిడుగులు ముగ్గురిని బలితీసుకున్నాయ. మంచిర్యాల జిల్లా బీమారం మండలం పోలంపల్లి వరి కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం ఉరుములు మెరుపులతో పిడుగు పడిన ఘటనలో పంటక్షేత్రంలో పనిచేస్తున్న యువకుడు రాజేందర్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నేరడిగొండ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురియగా తేజాపూర్ గ్రామానికి చెందిన తెడ్డు గంగయ్య (34), బోథ్ మండలం రేండ్లపల్లి గ్రామానికి చెందిన నైతం మారుతి (28) చెట్టుకింద తలదాచుకునేందుకు వెళ్ళగా చెట్టుపై పిడుగుపడటంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి వరకు వీరు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజాము నుండి పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా నేరడిగొండకు సమీపంలోని ఓ చెట్టుకింద రెండు మృతదేహాలు కనిపించాయి. రేండ్లపల్లికి చెందిన నైతం మారుతి తేజాపూర్ గ్రామంలో పాలేరుగా పనిచేస్తూ భార్యతో కలిసి అక్కడే కాపురం ఉంటున్నాడు. భార్య ఎనిమిది నెలల గర్భవతి కావడం, కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో వారి రోదనలకు అంతులేకుండా పోయింది. తేజాపూర్‌లో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.