క్రైమ్/లీగల్

చోరీకి గురైన 24గంటల్లో లారీ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఏప్రిల్ 23: పార్కింగ్ చేసిన లారీ చోరీకి గురైన 24గంటల్లోనే స్వాధీనం చేసుకొని యజమానికి అప్పగించామని సెంట్రల్ ఏసీపీ అంకినీడు ప్రసాద్ అన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిరిపురపు రమేష్‌బాబు (యజమాని, డ్రైవర్) నవత ట్రాన్స్‌పోర్టు దగ్గరలో రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించటంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనానికి అమర్చి ఉన్న జీపీఎస్ ద్వారా లారీ ఎక్కడ ఉన్నదీ వెంటనే కనిపెట్టారు. పెదపులిపాక కరకట్టపై లారీని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదువులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. మోపిదేవి మండలం కె కొత్తపాలెం గ్రామానికి చెందిన బుర్రె సతీష్ కుమార్(26) తరలిస్తుండగా 20లక్షల రూపాయల విలువైన లారీని తమ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. వాహనాల యజమానులు తప్పనిసరిగా జీపీఎస్ అమర్చుకోవడం మంచిదని ఏసీపీ సూచించారు. లారీని స్వాధీనం చేసుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ ఎస్‌ఐ రమేష్ కుమార్, సిబ్బందిని సెంట్రల్ ఏసీపీ అంకినీడు ప్రసాద్, డీజీ శివాజీరాజా అంభినందించారు. సీఐ వాసా పెద్దిరాజు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

చైన్‌స్నాచర్ల అరెస్టు
పెనమలూరు, ఏప్రిల్ 23: యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఈ నెల 19న శివపార్వతి నగర్ నుండి అవనిగడ్డ వైపు కరకట్టపై వాకింగ్ చేస్తుండగా మెడలోని చైన్, చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై పారిపోయారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం యనమలకుదురు లాకుల వద్ద నిందితులను పెనమలూరు క్రైమ్ ఎస్‌ఐ రమేష్ అదువులోకి తీసుకుని ఆరెస్ట్ చేశారు. వారి నుండి నగలు, రూ. 17వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.