క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, ఏప్రిల్ 23: ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రం సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జింట్టు (18) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుడు గత కొన్ని రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులు నందిగామ మండలానికి చేరుకొని అమ్మాయిని తీసుకువెళ్లారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన జింట్టు అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి స్నేహిడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.