క్రైమ్/లీగల్

జీనత్‌కు రూ.15 కోట్ల టోపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 23: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ జీనత్ అమన్‌పై లైంగికదాడి, చీటింగ్‌కు పాల్పడిన ముం బయి వ్యాపారవేత్త సర్ఫరాజ్ అలియాస్ అమన్ ఖన్నాను పోలీసులు అరెస్టు చేశారు. జీనిత్ ఫిర్యాదును నమోదు చేసుకుని గురువారం రాత్రి ఖన్నాను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తనపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా రూ.15 కోట్లు కాజేశాడని జీనత్ తన ఫిర్యాదులో పేర్కొంది. జుహూ పోలీసు స్టేషన్‌లో గురువారం రాత్రి ఆమె ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసును క్రైం విభాగానికి అప్పగించామని, దర్యాప్తు సాగుతోందన్నారు.