క్రైమ్/లీగల్

పారిజాతగిరిపై ఆటో బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, మార్చి22: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై నుండి గురువారం కిందికి దిగుతూ అదుపుతప్పిన ఆటో గోడను ఢీకొని బోల్తా పడటంతో ఒక మహిళ మృతి చెందగా 11 మంది గాయాలపాలయ్యారు. పారిజాతగిరి కొండపైకి గల సీసీ రోడ్డులో తిరుగు ప్రయాణంలో పారిజాతగిరి టౌన్‌లో ప్రాణాలను హరిస్తూ మృత్యుమలుపుగా మారిపోయింది. ఇదే ప్రదేశంలో 2015 నవంబర్ 7న జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. అదే నెలలో మరో ప్రమాదం సంభవించి పదిమంది గాయపడ్డారు. గురువారం ఉదయం ఏలూరు సమీపంలోని వెంకటాపురం, చాటపర్తి తదితర గ్రామాల నుండి 20 మంది ఒకే కుటుంబానికి చెందిన దగ్గరి రక్తబంధువులు కౌశిక్ అనే బాలుని అన్నప్రసాన కోసం రెండు ఆటోల్లో బయలు దేరారు. వీరంతా ద్వారకాతిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అన్నప్రాసన అనంతరం శ్రీ మద్ది ఆంజనేయస్వామివారిని దర్శించుకుని, తరువాత పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. రెండు ఆటోల్లో పారిజాతగిరిపైకి చేరుకుని పూజల అంతరం ఒక ఆటోలో పదిమంది పిల్లలను ఎక్కించి, మరొక ఆటోలో అన్నప్రాసన జరిగిన బాలుడు కౌశిక్‌తో సహా 12 మంది ఎక్కారు. 12 మంది ఎక్కిన ఏపీ 21 టిఎక్స్ 4751 నంబర్‌గల ఆటో కొంత దిగుతూ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మృత్యు మలుపులో అదుపుతప్పి గోడకు ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బోల్తా పడింది. దీనితో ఆటోలో ఉన్న కొమ్మన వెంకటమ్మ(45)తలకు బలమైన గాయమైన మృతి చెందింది. ఆమె చాటపర్తికి చెందిన మహిళ. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న కె నాగేశ్వరరావు, పి సాయికుమారి, జె శేఖర్, పి అప్పలరాజు, కె రమేష్, ఆటో డ్రైవర్ పి దుర్గారావు, కె ఉమామహేశ్వరరావు, దొరబాబు, కుసుమకుమారి, కె వెంకటలక్ష్మి గాయాలపాలయ్యారు. వీరిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న డిఎస్పీ చిటికెన మురళీకృష్ణ, సిఐ కె బాలరాజు, ట్రాఫిక్ ఎస్సై ఎ ఆనందరెడ్డి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, వారికి సత్వర చికిత్స అందేలా చూసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, పరిమితికి మించి ఆటోలో ప్రయాణీకులను ఎక్కించుకోవడం వల్లే ఇటువంటి ప్రమాదం సంభవించిందని డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ అన్నారు. మృత్యు మలుపులో ఇక మీదట ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపడతామని చెప్పారు. దేవస్థానం ఛైర్మన్ బిక్కిన సత్యనారాయణ, ధర్మకర్తలు సంఘటనా స్థలానికి రావడమే కాకుండా ఏరియా ఆసుపత్రికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.