క్రైమ్/లీగల్

బినామీ పేర్లుతో కోట్లాది అక్రమాస్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 21: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఏస్టేట్ ఆఫీసర్ రాచూరి శివరావు డిప్యుటేషన్‌ను రాష్ట్ర పర్యాటక సాధికారిక సంస్థ రద్దు చేసింది. ఏపీ టూరిజిం మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆర్ శివరావు ఇళ్లపై సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా శివరావు గతంలో విజయవాడ అర్బన్ తహశీల్దారుగా పనిచేసిన తర్వాత డిప్యుటేషన్‌పై టూరిజం శాఖకు వెళ్లారు. అయితే తాజాగా ఏసీబీ కేసులో చిక్కుకోవడంతో టూరిజం శాఖ సదరు అధికారి డిప్యుటేషన్ రద్దు చేసి మాతృ సంస్థ రెవెన్యూశాఖకు సరెండర్ చేశారు. ఇదిలావుండగా శివరావు అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు గురువారం కూడా కొనసాగాయి. రెండోరోజు తనిఖీల్లో కూడా కోట్లకొలది ఆస్తులు కనుగొన్నారు. శివరావు తన సర్వీసులో అక్రమంగా సంపాదించిన ఆస్తులను చాలావరకు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులను బినామీలుగా పెట్టారు. దగ్గర బంధువైన రెబ్బ సుబ్బారావు బినామీగా కృష్ణాజిల్లా నున్నలో 157 చదరపు గజాలు, గన్నవరంలో 420 చదరపు గజాలు, గన్నవరంలోనే మరో 150 చదరపు గజాలు చొప్పున 3 ప్లాట్లు గుర్తించారు. అదేవిధంగా శివరావు అత్త దార్ల చిట్టెమ్మ పేరుతో కృష్ణాజిల్లా గుండిమెడలో 709.86 చదరపు గజాలు, గూడూరు మండలంలో 690 చదరపు గజాలు, కంకిపాడు మండలంలో 100 చదరపు గజాలు చొప్పున మూడు ప్లాట్లు కనుగొన్నారు. అలాగే శివరావు మరో బినామీగా తన ఆప్తుమిత్రుడైన ఐ సుబ్రహ్మణ్యం పేరుతో కృష్ణాజిల్లా నున్నలో 200 చదరపు గజాల స్థలాన్ని పెట్టినట్లు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో దగ్గరి బంధువైన కోటా శ్రీనివాసరావు బినామీగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరు గ్రామంలో 200 చదరపు గజాల స్థలాన్ని 2016లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రెండోరోజు సోదాల్లో వెల్లడైన ఆస్తుల చిట్టా కూడా మార్కెట్ విలువ ప్రకారం కోట్లలోనే ఉంటుందని అంచనా. కాగా నిందితుడిని అరెస్టు చేసి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండుకు తరలించినట్లు ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్ తెలిపారు.