క్రైమ్/లీగల్

విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, మార్చి 22: పట్టణంలోని ఎస్‌ఎన్ కాలనీకి చెందిన హరీష్‌కుమార్(25) అనే విద్యార్థి గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఎన్ కాలనీకి చెందిన హరీష్‌కుమార్ గత రెండు సంవత్సరాల కిందట బీటెక్ చదువు పూర్తయినట్లు తెలిపారు. బీటెక్‌కు సంబంధించిన సబ్జెక్టులు పెండింగ్‌లో ఉండటంతో మనస్థాపం చెంది ఆ సబ్జెక్టులు పాస్ కాలేనేమోననే భయంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.