క్రైమ్/లీగల్

రాజా, కనిమొళిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: మాజీ టెలికాం మంత్రి ఎ. రాజా, డిఎంకె ఎంపి కనిమొళి తదితరులకు 2జి స్పెక్ట్రమ్ కేసులో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణ తేదీ మే 25లోగా తమ స్పందనలను దాఖలు చేయాలని కోర్టు నోటీసుల్లో ఆదేశించింది. కాగా 2జి మనీ లాండరింగ్ కేసులోఈడీ జప్తు చేసిన రూ.223 కోట్ల విలువైన ఆస్తుల విషయంలో ప్రస్తుతం ఉన్న స్థితినే యథాతథంగా కొనసాగించాలంటూ అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) తుషార్ మెహతా దాఖలు చేసిన మధ్యంతర అభ్యర్థనను కోర్టు అనుమతించింది. నిందితులను సీబీఐ న్యాయస్థానం విడుదల చేసిన నేపథ్యంలో థర్డ్‌పార్టీ హక్కులు తమకు ఉన్నందువల్ల జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయడానికి ఈడీ ఇష్టపడటం లేదు. అందుకు కోర్టు అనుమతిస్తూనే, ఈ విషయంలో ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశారంటూ ప్రశ్నించింది. మొదట జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయకుండా స్టే విధించేందుకు కోర్టు అంగీకరించలేదు. కానీ ఏఎస్‌జీ తన వాదన వినిపిస్తూ జప్తు చేసిన ఆస్తులపై స్టే విధించిన ఉదాహరణలను ప్రస్తావించడంతో కోర్టు అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. 2జి స్కామ్‌కు సంబంధించిన కేసులో అందరినీ సీబీఐ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూమార్చి 19న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా మంగళవారం సీబీఐ కూడా వీరి విడుదలను హైకోర్టులో సవాలు చేసింది.
గత డిసెంబర్ నెలలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రాజా, కనిమొళి, మరో 17 మందిని 2జి స్పెక్ట్రమ్ కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. స్వాన్ టెలికామ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు, డిఎంకె ఆధ్వర్యంలో నడిచే కలైగర్ టీవీకి రూ.200 కోట్లు చెల్లించారని ఈడీ తన ఛార్జ్‌షీటులో పేర్కొంది. కాగా 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఖజానాకు రూ.30,984 కోట్లమేర నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. ఈ పిటిషన్‌ను 2012, ఫిబ్రవరి 2న ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. అయితే న్యాయమూర్తి ఒ.పి. సహాని, ‘‘ప్రాసిక్యూషన్ ఈ అవినీతి ఆరోపణలను నిరూపించడంలో దారుణంగా విఫలమైంది’’ అంటూ తన తీర్పులో పేర్కొన్నారు. 2జి స్పెక్ట్రమ్ కేసులను విచారించేందుకు 2011, మార్చి 14న ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. మొదటి కేసులో సీబీఐ 15 మంది నిందితులను విచారించగా, రెండో కేసులో ఈడీ 19 మందిని విచారించింది. మూడో కేసులో ఎస్సార్ ప్రమోటర్స్‌తో సహా 8 మంది ఉన్నారు.