క్రైమ్/లీగల్

అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి 26మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, మార్చి 21: అఫ్గానిస్థాన్‌లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది దుర్మరణం చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది యువకులే ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజ్రత్ రహిమి తెలిపారు. కాబూల్ యూనివర్సిటీకి సమీపంలోని ఓ ఆసుపత్రి ఎదురుగా పేలుడు జరిగింది. పర్షియన్ కొత్త సంవత్సరం సందర్భంగా ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని రహిమి తెలిపారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియనప్పటికీ, తాలిబనే్ల ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాబూల్‌లో గత కొన్ని వారాల్లోనే జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇది ఐదవది కావడం గమనార్హం. గత పదహారేళ్లుగా తాలిబన్ ఉగ్రవాదులతో అతలాకుతలం అవుతున్న అఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు అఫ్రాష్ ఘనీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే చర్చలకు రావాల్సిందిగా తాలిబన్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. శాంతియుత పరిస్థితులు కుదురుకుంటున్న సమయంలో మళ్లీ తాలిబన్లు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆత్మాహుతి దాడులకు దిగుతున్నారు.

పుణెలో పేలిన పార్సిల్

అహ్మద్‌నగర్, మార్చి 21: పూణెకు చెందిన ఒక ఎన్‌జీఓకు డెలివరీ చేయాల్సిన పార్సిల్‌లో పేలుడు సంభవించడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ పేలుడు కొరియర్ కార్యాలయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గతరాత్రి చోటుచేసుకోగా, పోలీసులు పేలుడుకు కారణాలను అనే్వషిస్తున్నారు. గాయపడిన ముగ్గురు ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు.

భారతీయుల ఊచకోతపై అమెరికా దిగ్భ్రాంతి

వాషింగ్టన్, మార్చి 21: ఇరాక్‌లో 39 మంది భారతీయులపై జరిగిన హత్యాకాండపై అమెరికా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ హత్యాకాండను ఖండించడంలో భారత ప్రజలకు మద్దతుగా ఉంటామని పేర్కొంది. 2014లో ఇరాక్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయులను ఐసిస్ హతమార్చిన సంగతి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నిన్న పార్లమెంట్‌కు తెలిపిన సంగతి తెలిసిందే.