క్రైమ్/లీగల్

బుల్లెట్లు దొరికాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 19: జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ కార్వర్టర్స్ ఆవరణలో ఉన్న ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ గార్డ్ విభాగంలో ఈ నెల 17న అనూహ్యంగా మాయమైన 15 బుల్లెట్లు ఎట్టకేలకు లభ్యమయ్యాయి. సోమవారం వీటిని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలోని ఓ డస్ట్‌బిన్‌లో గుర్తించారు. ఏఆర్ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్న పెన్నోబిలేసు అనే హోంగార్డు నిర్వాకం వల్లే బుల్లెట్లు మాయమైనట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. స్వీపర్‌గా పని చేస్తున్న సదరు హోంగార్డును సరిగా పని చేయక పోవడంతో ఏఆర్ పోలీసు సిబ్బంది మందలించగా, వారిపై కోపం పెంచుకుని, అవకాశం రావడంతో బుల్లెట్లను మాయం చేశాడు. ఈ నెల 17న ఉదయం 6.30 గంటల సమయంలో విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ సోమశేఖరనాయుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో 20 బుల్లెట్లతో కూడిన బెల్ట్(కవర్)ను అక్కడి సోప్‌బాక్స్‌పై ఉన్న హ్యాండిల్‌కు తగిలించాడు. అయితే వాటిని అక్కడే మర్చిపోయాడు. బయటకు వచ్చిన అరగంట అనంతరం బుల్లెట్లు లేవని గుర్తించి వెంటనే బాత్‌రూమ్‌కు వెళ్లి పరిశీలించగా అందులో 5 బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 15 మాయమయ్యాయి. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపిన విషయం విదితమే. దీనిపై ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్ ఆదేశాలతో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ విచారణ చేపట్టారు. ఏఆర్ హెడ్‌కార్టర్స్, గార్డ్ విభాగం, ఆవరణలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. అలాగే పరిసరాలను గాలించారు. ఈ క్రమంలో అక్కడే పని చేస్తున్న ఇద్దరు సిబ్బందిని అనుమానించారు. విచారణ వేగవంతం కావడంతో భయపడిన హోంగార్డు తాను దాచిన ప్రదే శం నుంచి బుల్లెట్లను తీసుకుని డస్ట్‌బిన్‌లో పడేశాడని ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ తెలిపారు. అవి దొరకడంతో ఉన్నతాధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిపై టూ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. బుల్లెట్లు లభ్యం కావడంతో చార్జ్‌షీట్ ఫైల్ చేసి కోర్టుకు హాజరు పర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.