క్రైమ్/లీగల్

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, మార్చి 18:అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్తను ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ కంభగిరి రాముడు తెలిపారు. వివరాలు.. ఈ నెల 16వ తేదీ మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో వేముల లత (28)ను భర్త వడ్డే లక్ష్మీనారాయణ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పారిపోయిన లక్ష్మీనారాయణ ద్విచక్ర వాహనంతో పాటు కొండల్లో ఉంటూ పరిస్థితిని పరిశీలిస్తూ ఆదివారం స్వగ్రామం తిమ్మాపురానికి బయల్దేరాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని పాత రైల్వే క్వాటర్స్‌లో పెట్టి రైలు ఎక్కుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా భార్య మీద అనుమానంతోనే కత్తితో పొడిచి చంపినట్లు లక్ష్మీనారాయణ అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం అతడిని డోన్ కోర్టు జడ్జి ముందు హాజరుపరచినట్లు సీఐ తెలిపారు. సీఐతో పాటు ఎస్‌ఐలు తిరుపాలు, జీఎండీ బాషా, ఏఎస్‌ఐ భాస్కర్, సిబ్బంది ఉన్నారు.