క్రైమ్/లీగల్

నీటి సంపులో పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, మార్చి 18 : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో భూమిక (6) నీటి సంపులో పడి ఆదివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే భూమిక తల్లి మారెక్క ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి పిల్లలకు భోజనాన్ని వడ్డించి పూర్తయిన తర్వాత ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఓ ఇంటి ముందు ఉన్న సంపుపై తుప్పు పట్టిన ఓ ఇనుప రేకును మూసి ఉన్నారు. భూమిక తోటి చిన్నారులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రేకుపై కాలు మోపడంతో విరిగి సంపులోకి పడిపోయింది. దీంతో తోటి చిన్నారులు భయపడి పరుగెత్తుకెళ్లారు. అయితే భూమిక అక్క ఉమ జరిగిన విషయాన్ని పది నిమిషాల తర్వాత ఇతరులకు తెలియజేసింది. వెంటనే సంపులోకి దిగి భూమిక మృతదేహాన్ని తీశారు. విషయం తెలిసిన వెంటనే భూమిక తల్లి కాలనీవాసులు కన్నీరుమున్నీరుగా విలపించారు.