క్రైమ్/లీగల్

జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు మహిళలూ అర్హులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ నార్తరన్ విద్యుత్ డిస్కాం జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు మహిళల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. హమేరా అంజుం, వి మమత, మరో ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి పై ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. సాధారణంగా జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు పురుష అభ్యర్థుల నుంచి అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. తదుపరి ఆదేశాల వరకు ఈ ఉద్యోగాల ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు నార్తరన్ డిస్కాంను ఆదేశించింది. జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు మహిళలను ఎందుకు అనుమతించరని హైకోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఆధునిక ప్రపంచంలో మహిళలు అంతరిక్షానికి కూడా వెళుతుంటే, జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఎందుకు అనుమతించరని హైకోర్టు అడిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుంకర చంద్రయ్య వాదనలు వినిపించారు. పోలీసు శాఖలో, ఎక్సైజ్ శాఖలో రవాణా శాఖలో ఎస్సై, డిఎస్పీ పోస్టులకు మహిళలు దరఖాస్తు చేసుకుంటున్నారని, వారిని నియమిస్తున్నారని కోర్టుకు తెలిపారు. మహిళల పట్ల వివక్షత ప్రదర్శించడం తగదన్నారు. ఏపిఎస్‌ఇబి ఎంప్లారుూస్ సర్వీసు రెగ్యులేషన్స్ పార్టు-2, రాజ్యాంగంలోని 14, 15(3), 16, 21, 39(ఏ) అధికరణలకు విరుద్ధంగా వ్యవహరించరాదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి వారిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. కాని ఫలితాలను మాత్రం తదుపరి ఆదేశాల వెలువడే వరకు ప్రకటించరాదని కోర్టు ఆదేశించింది.