క్రైమ్/లీగల్

సాగర్ ఎడమ కాల్వలో పడ్డ కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 31: మండలం లోని వాటర్‌ట్యాంకు తండా పంచాయతీ శివారులోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో మంగళవారం రాత్రి కారు ప్రమాదవశాత్తు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఎండీ.ఖమ్రుల్లా (57) ప్రభుత్వ ఉద్యోగి మరణించాడు. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌లో నివసించే ఖమ్రుల్లా అనే వ్యక్తి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి మంగళవారం అతని అల్లుడు షేక్ రఫీతో కలిసి కారులో కాల్వ వద్ద ఉన్న అండర్ పాస్ 2 అడుగుల మేర నీరు నిలిచి ఉండటంతో అండర్ పాస్ నుండి కాకుండా పక్కనుండి వెళ్లాడు. తిరిగి రాత్రి సుమారు 10.30 గంటలకు తిరిగి వస్తూ రైల్వే అండర్ పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో రాత్రి వేళ్ల కారు ఆగిపోతుందనే అనుమానంతో అండర్ పాస్ పక్కన నున్న స్థలం నుండి కారు తీసే యత్నించాడు. ఒకే సారి కాల్వవైపు కారు ఒరిగిపోయి పడిపోతుండటంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న అల్లుడు రఫీ కారులో నుండి బయట పడ్డాడు. కారులో నిద్రపోతున్న ఖమ్రుల్లా మాత్రం కారులోనే ఉండిపోయాడు. కారు పడి పోవడంతో అందులోనే ఊపిరి ఆడకపోవడంతో మరణించాడు. వెంటనే జరిగిన విషయాన్ని రూరల్ పోలీసులు, బంధువులకు రఫీ తెలిపాడు. బుధవారం ఉదయం క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. అందులో నుండి ఖమ్రుల్లా మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, రూరల్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఎ.రమేష్‌బాబు, ఎస్‌ఐ డి.సైదాబాబులు సందర్శించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.