క్రైమ్/లీగల్

కొరియన్ రెస్టారెంట్లపై టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, అక్టోబర్ 30 : పట్టణ సమీపంలో నిర్వహిస్తున్న కొరియన్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ డీఎస్పీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోపాల్ మాట్లాడుతూ ఇద్దరు కొరియన్, నలుగురు స్థానికులను అరెస్టు చేసి రూ.75 వేల విలువజేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో గత కొంతకాలంగా కొరియన్ రెస్టారెంట్లలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలు సాగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో దాడులు నిర్వహించామన్నారు. ఇందులో కొరియన్‌కు చెందిన రెస్టారెంట్లు రూ.45 వేల విలువజేసే విదేశీ మద్యం, రూ.35 వేల విలువజేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉండగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపారు. కొరియాకు చెందిన కింగ్ జా హోల్, డెన్ జాంగ్ బెల్‌తోపాటు జోషి, మురుగన్, రాందాస్, జయన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై అక్రమ మద్యాన్ని నిలువ ఉంచడం, అక్రమ వ్యాపారం చేయడం వంటి సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.