క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, అక్టోబర్ 30 : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మండలంలోని చింతలాంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిళ్లపల్లి రైతు సుధాకర్(42) పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వరుస కరువులతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుధాకర్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఉరవకొండ, అక్టోబర్ 30 : పట్టణ శివారు ప్రాంతంలోని అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పట్టణానికి చెందిన కుమ్మరి సంజప్ప (70) ద్విచక్ర వాహనంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ వేసుకుని ఇంటికి వెళ్తుండగా అనంతపురం నుండి బళ్లారికి వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో సంజప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
గుంతకల్లు, అక్టోబర్ 30 : వేరుశెనగ పంట వడుపుకునేందుకు ఏర్పాటు చేసిన యంత్రానికి ప్రమాదవశాత్తు చీర చుట్టుకుని ఆదివారం తీవ్రంగా గాయపడిన రామలక్ష్మి మంగళవారం మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మండలంలోని పులగుట్టపల్లి గ్రామానికి చెందిన రామలక్ష్మి ఈనెల 28న పొలంలో వేరుశెనగ యంత్రం వద్ద పని చేస్తుండగా చీర యంత్రానికి ఉన్న బెల్టుకు తగులుకుంది. దీంతో యంత్రం లోపలికి లాక్కుంది. గమనించిన తోటి కూలీలు యంత్రాన్ని నిలిపి బయటకు తీశారు. వెంటనే తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అదనపు వైద్య చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.