క్రైమ్/లీగల్

యువతి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమరోలు, అక్టోబర్ 29: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పందరబోయిన ఇంద్రకళావతి (20) అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఆవులయ్య, అంజనమ్మలకు ఇరువురు కుమార్తెలు, ఇరువురు కుమారులు కాగా పెద్దకుమార్తెకు, పెద్దకుమారుడికి వివాహం జరిగాయి. మూడవ సంతానమైన ఇంద్రకళావతికి కూడా వివాహం చేసేందుకు ఇటీవల ఆవులయ్య సోదరి కుమారుడితో నిశ్చితార్థం జరిగింది. కాగా ఇంద్రకళావతి అదే గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఒక యువకున్ని ప్రేమించింది. ఐదేళ్ళకిందట ఇంద్రకళావతి ఇంటర్మీడియేట్ చదువుతుండగా ఆ యువకుడు డిగ్రీ చదువుతుండేవాడు. వారిరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న ఆవులయ్య తన కుమార్తెను అర్థాంతరంగా చదువుమానిపించాడు. ఆవులయ్య బిఎస్‌ఎఫ్‌లో పనిచేసి రిటైర్డు అయిన గతకొంతకాలంగా హైదరాబాద్‌లోని మెట్రో రైల్వేస్టేషన్‌లో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. ఇటీవల ఇంద్రకళావతి, హరిజనవాడకు చెందిన యువకుడు హైదరాబాద్‌కు వెళ్ళి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఆమేరకు పోలీసులు ఆవులయ్యను పిలిపించి ఇంద్రకళావతికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగింనట్లు తెలిసింది. అయినప్పటికీ ఇంద్రకళావతి మనస్సు మార్చుకోకపోవడంతో ఇటీవల ఆవులయ్య తన కూతురితో కలిసి స్వగ్రామమైన నాగిరెడ్డిపల్లికి వచ్చాడు.
కాగా మేనత్త కుమారునితో నిశ్చితార్థం జరిగి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో కూడా హరిజనవాడకు చెందిన యువకునితో మాట్లాడటం ఏమిటని, పెళ్ళి ఇష్టం లేనట్లైతే నిశ్చితార్థంకు ముందే తనకు చెప్పాల్సిందని, దీనితో నిశ్చితార్థం ఆపేసేవాళ్ళం కదా అంటూ తల్లిదండ్రులు ఇంద్రకళావతిని మందలించినట్లుగా తెలుస్తోంది. అందుకు కళావతి తల్లిదండ్రుల మాట వినకపోవడంతో పరువుహత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఇంద్రకళావతి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా సోమవారం తెల్లవారుజామున శ్మశానవాటికకు తీసుకువెళ్ళి దహనం చేసినట్లుగా గ్రామస్తులు తెలిపారు. అయితే అనారోగ్యంతో మృతి చెంది ఉంటే తెల్లవారుజామున శవాన్ని దహనం చేయాల్సిన అవసరం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించుకుంటున్నారు. కాగా తమ కుమార్తె అనారోగ్యంతో మృతి చెందిందని, తాము తమ కుమార్తెను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, ఆమెను హత్య చేయలేదని తల్లిదండ్రులు ఆవులయ్య, అంజనమ్మ చెబుతున్నారు.
కాగా యువతిని తెల్లవారుజామున దహనం చేయడంపై అనుమానం వ్యక్తం చేసిన తాటిచర్ల విఆర్‌ఓ బాష సోమవారం గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై మల్లికార్జునరావు నాగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళి ఆవులయ్య ఇంటిని పరిశీలించారు. కాగా ఇంద్రకళావతి మృతిపై సిఐ వి శ్రీరామ్‌ను పాత్రికేయులు వివరణ కోరగా ఇంద్రకళావతి మృతి అనుమానస్పదంగా ఉందని, ఆమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా పరువుహత్యకు ఆధారాలు లేవని దర్యాప్తు జరుపుతున్న డివైఎస్పీ రామాంజనేయులు చెప్పారు.