క్రైమ్/లీగల్

భారీగా పేలుడు పదార్థాల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 29: తెలంగాణలో జరిగే సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ నిఘాను విస్తృతం చేసింది. నిన్న పెద్ద మొత్తంలో దొంగనోట్ల కలకలం... నేడు భారీగా పేలుడు పదార్థాల పట్టివేత రామగుండం కమీషనరేట్‌లో చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికల తేది దగ్గరపడ్డ సమయంలో ఈ వ్యవహారం ఆందోళనకు గురి చేస్తుంది. సోమవారం రామగుండం కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రాంతాల్లో పోలీసు ప్రత్యేక బృందాలు చేపట్టిన దాడుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలైన 14,800ల ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 1874 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 10,523 జిలిటెన్ స్టిక్స్, 289 బూస్టర్స్, 80 అమ్మోనియం బ్యాగ్స్, 8 గన్ పౌడర్ బ్యాగ్స్ పట్టుకున్నారు. వీటితోపాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకోగా 12 మంది పేలుడు పదార్థాలు రవాణా చేసే వ్యక్తులను అరెస్ట్ చేశారు. కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అరెస్ట్ వివరాలను వెల్లడించారు. అరెస్టయిన వారిలో మంచిర్యాలకు చెందిన అజ్మీర నిర్మల్ రాయ్, జూలపల్లికి చెందిన రానవేని ధర్మరాజు, సుల్తానాబాద్‌కు చెందిన అల్లెపు చంద్రశేఖర్, పెద్దపల్లికి చెందిన ముస్త్యాల హరిప్రసాద్, పాత బాలక్రిష్ణ, కన్నాలకు చెందిన సయ్యద్ బాపు, ఒల్లెపు వెంకటి, బసంతనగర్‌కు చెందిన ధర్మాజి శ్రీనివాస్, చొప్పదండికి చెందిన నర్కూల్ల గంగాధర్, మొగిల్లి శ్రీనివాస్, భూపతి హరినాథ్ బాబు, భూపాపల్లి జిల్లా కాటారంకు చెందిన సానబోయిన కుమారస్వామి ఉన్నారు. కాగా ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ... ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశామని... అదేవిధంగా ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అస్కారం లేకుండా పూర్తి స్థాయిలో కమిషనరేట్ పరిధిలో నిఘాను పటిష్టం చేశామన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. మావోయిస్టుల దాడులను దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్స్ లాంటి ప్రమాదకరమైన సామాగ్రి అక్రమ రవాణా జరగకుండా కమీషనరేట్ దృష్టి సారించిన్నట్లు తెలిపారు. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్, అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ రవి కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్, సిసిఎస్ పోలీసులతో 15 ప్రత్యేక బృందాలతో కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించగా అక్రమంగా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను భారీగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. కమీషనరేట్ పరిధిలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక గ్రేహౌండ్స్ టీంతో కూంబింగ్ చేపడుతున్నామని చెప్పారు. మావోయిస్టుల దాడులకు అస్కారం లేకుండా చర్యలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్, ఎఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, గోదావరిఖని ఎసిపి రక్షిత కె మూర్తి ఉన్నారు.

చిత్రాలు..పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్న రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ,
*అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ నిందితులు