క్రైమ్/లీగల్

కళాశాల బస్సు ఢీకొని విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29 : కళాశాల బస్సు ఢీకొన్ని ఓ విద్యార్థిని మృతి చెందింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జగద్గిరిగుట్ట సోమయ్యనగర్‌లో నివాసం ఉంటున్న పరమేష్, చంద్రకళ కుమార్తె రేకుల రమ్య (16) కూకట్‌పల్లిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది. రోజూ మాదిరిలాగే సోమవారం ఉదయం 8 గంటలకు కూకట్‌పల్లిలో బస్సు దిగి జీబ్రా గీతలపై రోడ్డు దాటుతుండగా అదే కళాశాలకు చెందిన (ఏపీ 36 ఎక్స్ 5544) బస్సు అతి వేగంగా రమ్య పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమతోటి విద్యార్థిని కళ్ల ముందే మృతి చెందడం తట్టుకోలేక విద్యార్థులు ఆగ్రహంతో రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేసి రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య కళాశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థిని మృతి చెందిందని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. రమ్య తల్లిదండ్రులకు నష్ట పరిహారం చెల్లించి విద్యార్థి మృతికి కారణమైన డ్రైవర్‌ను, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోని శిక్షించాలని డిమాండ్ చేశారు.

గ్రేట్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాకు ఫిక్కీ
ఇండియా అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 29: ఫిక్కీ ఇండియా స్పోర్ట్స్ అవార్డు వద్ద బెస్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీగా గ్రేట్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాఅవార్డు అందుకున్నది. ఈ అవార్డులు క్రీడా రంగంలో అశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, క్రీడా మద్దతుదారులు, దేశంలో క్రీడా వౌలిక వసతుల అభివృద్ధిలో అసాధారణ ప్రతిభాపాటవాలు చూపిన సంస్థలను గుర్తించి సత్కరిస్తున్నాయి. ఈ అవార్డును గ్రేట్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కేంద్ర క్రీడా శాఖ మాజీ మంత్రి విజయ్ గోయల్ నుంచి అందుకున్నారు.

చిత్రాలు..కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు
*రమ్య( ఫైల్‌పొటో)