క్రైమ్/లీగల్

సీబీఐ నుంచి రక్షణ కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వ్యాపారవేత్త సాన సతీష్ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐలో లంచాలు ఇచ్చిన కేసుకు సంబంధించి ఏ-2గా ఉన్న తనపై, తన ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే విచారణకు రావాలని సీబీఐ సమన్లు జారీ చేసిందని, విచారణ సమయంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషితో ముడిపడి ఉన్న కేసులో తన పేరును తప్పించేందుకు సీబీఐ అధికారి రాకేశ్ అస్థానా లంచ తీసుకున్నారని సతీష్ ఆరోపించారు. సతీష్ ప్రకటన సీబీఐ అధికారుల మధ్య వివాదానికి దారి తీసింది. సతీశ్ వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ ఉన్నతాధికారి అస్థానాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.