క్రైమ్/లీగల్

వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, అక్టోబర్ 29: ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన ఆదివారం సాయంత్రం పుత్తూరు పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు... పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం కుమారుడు పైని (31)కి సమీప బంధువులతో గత కొంత కాలంగా ఆస్తి తగాదాలున్నాయి. న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హతుడు పైని పుత్తూరులో కాపురం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా అప్పటికే కాపుకాసి ఉన్న ఇద్దరు యువకులు ఆర్యవైశ్య శ్మశానవాటిక ఎదురుగా అడ్డగించి బండరాళ్లు ఇనుప దిమ్మెలతో అత్యంత కిరాతకంగా మోది హతమార్చారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హనుమంతప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.