క్రైమ్/లీగల్

కళేబరానికి ఆవు, దూడలు అమ్ముకున్న మున్సిపల్ ఉద్యోగి అడ్డుకున్న ‘్ధర్మ జాగరణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 29: సిరిసిల్ల కూరగాయల మార్కెట్‌లో తిరిగే ఆవు, దూడలను మున్సిపల్ ఉద్యోగి దొంగతనంగా కళేబరాలకు తరలించిన ఉదంతం వెలుగు చూసింది. ఈ సంఘటనపై ‘్థర్మ జాగరణ’ ఆధ్వర్యంలో అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మున్సిపల్ ఉద్యోగితో పాటు వాటిని కళేబరానికి తరలిస్తున్న వ్యక్తులు పారిపోయారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో ఆవు, దూడను తరలించడానికి ఉపయోగించిన వాహనం పట్టుబడింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల కూరగాయల మార్కెట్‌లో జీవించే ఆవు, దూడలను మున్సిపల్ ఉద్యోగి తక్కల అంజయ్య వాటిని కళేబరానికి అమ్ముకోవడానికి వీలుగా స్థానిక శాంతినగర్ బైపాస్ రోడ్డు వద్దకు ఎపీ 15-టీబీ 0956 నెంబర్ గల ట్రాలీ ఆటోలో తరలించారు. దీనిని గుర్తించిన ధర్మజాగరణ సభ్యులు అక్కడికి వెళ్ళి పశువుల కాపరిని విచారించడంతో మున్సిపల్ ఉద్యోగి తక్కల అంజయ్య కబేళాలకు తరలించడానికి అమ్ముకున్నట్టు చెప్పాడు. వెంటనే ఈ చర్యను వీరు అడ్డుకోవడంతో ట్రాలీ ఆటో డ్రైవర్, కబేళాలకు తరలించే వ్యక్తులు అక్కడి నుండి హుటా హుటిన తప్పించుకుని పారిపోయారు. వెంటనే ఘటనపై స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో ధర్మ జాగరణ ప్రముఖ్ సబ్బని బాలయ్య, కోడం రవి, గుడ్ల శ్రీ్ధర్, పోకల శ్రీనివాస్, గాజుల వేణు, మ్యాన రాంప్రసాద్, యెలిగేటి వంశీ తదితరులు పాల్గొన్నారు.