క్రైమ్/లీగల్

విద్యుత్తు కార్మికుడుకు తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, అక్టోబర్ 29: తిత్లీ తుపాన్ ధాటికి నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు పునరుద్దరణ సహాయక చర్యల్లో వున్న సీతంపేట మండలం, కిడిప గ్రామానికి చెందిన కె.చంద్రమోహన్‌కు తీవ్ర గాయాలైనట్లు సోదరుడు కె.శంకరరావు తెలిపారు. మెళియాపుట్టి మండలం, గాతవలస సమీపంలో విద్యుత్తు స్తంభాలు పునరుద్దరణ చేయడానికి విద్యుత్తు వైర్లును వేయడానికి విద్యుత్తు స్తంభం ఎక్కిన చంద్రమోహన్ ప్రమాదవశాత్తు కిందకు జారిపడ్డాడు. విద్యుత్తు స్తంభం నుంచి జారిపడడంతో తీవ్ర గాయాలైన చంద్రమోహన్ చికిత్స నిమిత్తం 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చంద్రమోహన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యచికిత్స కోసం శ్రీకాకుళంకు తరలించారు.