క్రైమ్/లీగల్

95లక్షలు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 28: ఎన్నికల వేళ ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.95 లక్షలు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిలో 4500 మందిని బైండోవర్ చేసినట్లు ఆదివారం పోలీస్ కమిషనరేట్‌లో విలేఖరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు భారీగా నగదు, నగలు తరలిస్తుండగా పట్టుకున్నామని, ఇదేవిధంగా అరకిలో గంజాయి, 1400 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా బైండోవర్ అయిన వ్యక్తులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఒక లక్ష రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించబడుతుందన్నారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎన్నికల నేపథ్యంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిని గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడిన వారిని, అనుమానితులకు పోలీస్ కమీషనర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. బైండోవర్ అయిన వ్యక్తులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. బైండోవర్ అయిన వ్యక్తులు ఇదే తరహా నేరాలకు పాల్పడితే రూ.లక్ష జరిమానా, ఆరు నెలల జైలుశిక్షతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలలో పల్లెలు, పట్టణాల్లోకి ప్రచారానికి వచ్చి పార్టీల అభ్యర్థులను అడ్డుకుంటే నేరమే అవుతుందని తెలిపారు. పోలీస్ రికార్డుల్లో ఒక్కసారి కేసు నమోదైతే జీవితాంతం ఎన్నికలు, పండుగలు ఇతరత్రా కార్యక్రమాలకు దూరమై పోలీస్ స్టేషన్‌లలోనే గడపాల్సి వస్తుందన్నారు. రౌడీషీటర్లుగా నమోదైన వారికి పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉంటాయని, ఉద్యోగాలకు దూరమై బ్రతుకు భారమై దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందన్నారు. రౌడీషీటర్ల పిల్లలు కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి ప్రచార బ్యానర్లు, పోస్టర్లను అంటించరాదని, ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు చేపట్టి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భవనాలు, భూములను కూడా సదరు యజమానుల అనుమతి తీసుకోవాలని, లేనట్లయితే ఫిర్యాదులు వస్తే చర్యలు చేపట్టి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజల భద్రత విషయంలో దేశవ్యాప్తంగా 4వ స్థానంలో నిలువడం గర్వకారణంగా ఉందన్నారు.