క్రైమ్/లీగల్

భార్యా పిల్లల ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 28: అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఇంటి యజమాని మృతి తీరని విషాదాన్ని నింపింది. ఆ విషాదాన్ని తట్టుకోలేని కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈక్రమంలో ఒకరు మరణించగా మిగతా ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసుల కథనంతో పాటు సేకరించిన సమాచారం మేరకు.. స్థానిక రంగనాయకులపేటకు చెందిన ముంగర కొండలరావు (50) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.
ఆయనకు భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు విష్ణువర్ధిని, దివ్యవౌనికలు ఉన్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి దాంపత్య జీవితంలో ఆదివారం పెను విషాదాన్ని నింపింది. వ్యాపార రీత్యా హైదరాబాద్‌కు వెళ్లిన కొండలరావు, అక్కడ ఓ హోటల్ గదిలో గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసుల ద్వారా కొండలరావు ఇంటి సమీపంలో ఉండే వ్యక్తికి తెలిసింది. ఆయన వెంటనే సమాచారాన్ని కొండలరావు భార్యతో పాటు వారి బంధువులకు ఆదివారం ఉదయానే్న తెలియచేశారు. భర్త మృతితో తీవ్ర కలత చెందిన సుజాత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొండలరావు మృతి సంగతి తెలుసుకున్న ఆయన బంధువులు ఇంటికొచ్చి తలుపుకొట్టగా ఎంతసేపటికి ఎవరూ తలుపులు తీయకపోవడంతో పైఅంతస్తులో ఉండే వడ్రంగి సహాయంతో తలుపులను పగులగొట్టి లోనికి వెళ్లగా హాలులో కొండలరావు పెద్దకుమార్తె విష్ణువర్ధిని (10) ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. లోపలకు వెళ్లగా పడక గదిలో సుజాత, చిన్నకుమార్తె దివ్యలు అపస్మారక స్థితిలో ఉండగా బంధువులు గుర్తించి విషయాన్ని పోలీసులకు తెలియజేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధిని మృతి చెందగా చిన్నకుమార్తె దివ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సుజాత పరిస్థితి 48 గంటలు గడిచేదాకా ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు.
సంతపేట సిఐ పాపారావు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదంతో చుట్టుపక్కల ఉన్నవారు కూడా నిత్యం తమతో ఎంతో సఖ్యతగా ఉండే కుటుంబంలో జరిగిన విషాదంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.