క్రైమ్/లీగల్

నకిలీ బంగారంతో బురిడీ:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, అక్టోబర్ 28 : నకిలీ బంగారంతో బురిడీ కొట్టించి రూ. 6 లక్షలు కాజేసిన 8 మంది మాయగాళ్లను అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజు తెలిపారు. కడప జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం డీఎస్పీ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అట్టేల అంకుల్‌కు కడప జిల్లాలోని వీరబల్లె మండలం మట్లి గ్రామ పంచాయతీ షికారుపాలెంకు చెందిన గంగరాజు, నాగరాజు, మనోహర్, అంజనప్పలకు ప్లాస్టిక్ పూల వ్యాపారంతో పరిచయం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో నిందితులు తమ వద్ద రాజుల కాలం నాటి 2 కిలోల బంగారు పూలు ఉన్నాయని, రూ. 6 లక్షలు తీసుకుని రాయచోటికి వస్తే వాటిని ఇస్తామని తెలుపడంతో ఈ నెల 21వ తేదీ అంకుల్ రాయచోటికి చేరుకున్నాడన్నారు. దీంతో రాయచోటి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద ఆ నలుగురితో పాటు క్రిష్ణానాయక్, చంద్రప్ప, సూర్య, చెన్నకేశవులు మొత్తం 8 మంది కలిసి 2 కిలోల నకిలీ బంగారాన్ని అంకుల్‌కు ఇచ్చి రూ. 6 లక్షల నగదు తీసుకున్నారన్నారు. అయితే ఆ తర్వాత అంకుల్ అవి నకిలీవి అని తెలుసుకుని ఈ నెల 26వ తేదీ రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారన్నారు. కేసు విచారణలో భాగంగా అర్బన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ గోవిందరెడ్డి, సిబ్బంది ఆదివారం సుండుపల్లె రోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుండి రూ. 5.76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారన్నారు.