క్రైమ్/లీగల్

పోలీసు కస్టడీకి సుధా భరద్వాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, అక్టోబర్ 27: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగంపై అరెస్టయిన హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, వెర్నర్ గోన్‌సాల్వెస్, అరుణ్ ఫెర్రీరాలను నవంబర్ 6వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పుణె కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురు కార్యకర్తలు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పుణె పోలీసులు ఫరీదాబాద్‌లో గృహనిర్బంధంలో ఉన్న భరద్వాజ్‌ను శనివారం ఉదయం అదుపులోకి తీసుకొని, సాయంత్రం కోర్టులో హాజరు పరిచారు. శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్న గోన్‌సాల్వెస్, ఫెర్రీరాలను కూడా శనివారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు. జిల్లా సెషన్స్ జడ్జి కేడీ వడానే శనివారం ఉదయం కోర్టుకు హాజరయిన గోన్‌సాల్వెస్, ఫెర్రీరాలను నవంబర్ 6వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రం కోర్టుకు హాజరయిన భరద్వాజ్‌ను కూడా నవంబర్ 6వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. నిందితులంతా ఇప్పటి వరకు గృహనిర్బంధంలో ఉన్నందున వారిని ఇంటరాగేట్ చేయలేదని, అందువల్ల ఇంటరాగేషన్ కోసం వారిని పోలీసు కస్టడీకి అప్పగించాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్ అంతకు ముందు జడ్జి ఎదుట వాదించారు. నిందితులను 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని ఆమె అభ్యర్థించారు. ఈ ముగ్గురు నిందితులకు నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని ఆమె కోర్టుకు చెప్పారు.