క్రైమ్/లీగల్

హీరాగోల్డ్ కంపెనీ కీలక వ్యక్తిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: వేలకోట్ల రూపాయలు డిపాజిట్ దార్లనుంచి వసూళ్ళు చేసి వాటిని సొంత ఖాతాల్లోకి మార్చుకున్న హీరాగోల్డ్ కంపెనీలో కీలక వ్య్తిక్తిగా ఉన్న బిజూ తామస్‌ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును క్రైంమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పచెప్పారు. బిజూ దామస్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సీనియర్ పోలీస్ అధికారులు సూచించడంతో హీరాగ్రూపు మోసాలు బయటపడతాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. హీరాగ్రూపులో ఉన్నత స్థాయిలో ఉంటూ కంపెనీకి డిపాజిట్‌లు ఎలా సమకూర్చుకోవాలో వాటిని తిరిగి కంపెనీ ఎండి నౌహీరాషేక్ ఖాతాల్లోకి తరలించాలో సాఫ్ట్‌వేరును రూపొందించిన వెబ్‌సైట్ పర్యవేక్షించడం, హెచ్ న్యూస్ మీడియా, వెబ్‌చానల్, ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్, యూటూబ్ వంటి సోషియల్ మీడియాను రూపొందించారు.